Sunday, November 22, 2015

About భయం - By Veerendranadh Sir

అన్నిటికీ భయపడేవాడు అసమర్థుడు.
దేనికీ భయపడనివాడు మూర్ఖుడు.
దేనికి భయపడాలో తెలుసుకున్నవాడు జ్ఞాని.
సహేతుక భయానికి జాగ్రత్త పడేవాడు మేధావి.
నిరర్ధక భయాల్ని ఎదుర్కోగలిగేవాడు విజేత.
‘భయం’ కనబడని దెయ్యం లాంటిది. భయపడే కొద్దీ మరింత భయపెడుతుంది. భయాన్ని ఎలా భయపెట్టాలో జైన గ్రంథంలో ఆరు సూత్రాల కథ ఒకటి ఉన్నది.
ఇతరుల కన్నా కాసింతయినా భిన్నంగా బ్రతకనివాడు జీవితంలో ఏ థ్రిల్లూ పొందలేడు.
"Drive the devil (fear) out" seminar by me. today (sunday) at 2.30 pm. at shirdi sai temple .... sivam road. Entry: free.
జైనులు చీమకు కూడా హాని తలపెట్టరు; అటువంటి జైన ధ్యాన ప్రార్ధనా మందిరంలో శిష్యుడి పక్కన కత్తి ఉండడం చూసి గురువు నివ్వెరపోయి కారణం అడిగాడు. "ఆచార్యా! ధ్యానం చేస్తూండగా నన్ను కబళించటానికి ఒక పెద్ద తేలు వస్తోంది. రోజు రోజుకూ దాని పరిణామం పెరుగుతోంది. భయంతో ధ్యానంపై మనసు నిలవటం లేదు. ఈ విషయం మీకు చెప్పాలంటే ఇబ్బందిగా అనిపించి, నేనే స్వయంగా దాన్ని సంహరిద్దామని కత్తి తెచ్చుకున్నాను" అన్నాడు శిష్యుడు.
"కత్తి బదులు ఒక సుద్దముక్క పెట్టుకో. రేపు అది కనపడగానే వీపు మీద గట్టిగా 'X’ గుర్తు పెట్టు. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు చెప్పు" అన్నాడు గురువు.
మరుసటి రోజు ధ్యానం చేస్తూ ఉండగా ఆ తేలు మళ్ళీ వచ్చింది. చేతిలోని సుద్దనే కత్తిగా భావిస్తూ, కసి తీరా దాని మీద లెక్క లేనన్ని సార్లు అడ్డంగా నిలువుగా గీశాడు. అక్కణ్ణుంచి అది వేగంగా పారిపోయింది. ధ్యానం పూర్తయిన తర్వాత గురువు మందిరంలోకి వెళ్ళి జరిగింది చెప్పాడు.
"నీ కడుపు మీది వస్త్రం పైకెత్తు" అన్నాడు గురువు. అక్కడ చూసిన శిష్యుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడి కడుపుపై లెక్కలేనన్ని ‘ఇంటూ’ మార్కులు ఉన్నాయి. అప్పుడా జైన గురువు ‘భయము బాహ్యము కాదనీ అంతర్గతమనీ’ చెపుతూ, భయంతో పోరాడటానికి ఆరు సోపానాల మార్గాన్ని చెప్పాడు:
1. నీ భయము సహేతుకమా, నిర్హేతుకమా శోధించు. సహేతుకమయిన భయాన్ని 'జాగ్రత్త' అంటారు. అది అభిలాషణీయము. 2. నీ భయాలన్నిటికీ నీవే కారణమన్న వాస్తవాన్ని నమ్ము. 3. నీ భయం వల్ల నీకు కలిగే నష్టాల్ని గుర్తించు. 4. భయాన్ని పారద్రోలే మార్గాన్ని అన్వేషించు. 5. పోరాడు. 6. నీ భయానికీ, దానివల్ల వచ్చే నీ నష్టానికీ నీవే బాధ్యుడవని అర్థం చేసుకో..!

No comments:

Post a Comment