Monday, June 19, 2017

అన్నీ తెలిసి ఉండడం గొప్ప కాదు.. ఇంకా చెప్పాలంటే అన్నీ తెలుసు అనే ఫీలింగ్‌తో విర్రవీగడం అంతకన్నా గొప్ప కాదు.
చాలా విషయాలు తెలిసిన వారికి జీవితం లాక్ అయిపోతుంది.. అంతకన్నా భిన్నంగా ఆలోచించలేరు, ప్రవర్తించలేరు. ఏమీ తెలీని వారు, ఇంకా ఇంకా తెలుసుకోవాలనే తపన ఉన్న వారు జీవితాన్ని ఎంజాయ్ చేసినంతగా ఇంకెవరూ చెయ్యలేరు.
కాబట్టి నీ జ్ఞానం, ఆ జ్ఞానం ద్వారా వచ్చే అహం నీకు జనాల్లో ఓ గౌరవం తెస్తుందేమో గానీ నీలో జిజ్ఞాసని చంపేస్తుంది, నీ జీవితాన్ని ఎందుకూ పనికిరాకుండా చేస్తుంది. Try to unlearn everything and re-learn from the scratch. ఫార్మేట్ చెయ్యబడిన హార్డ్‌‌డిస్క్‌లో మళ్లీ ఫ్రెష్‌గా 0,1లు నింపడం మొదలెట్టండి. ఈసారి లైఫ్ మరింత కొత్తగా కన్పిస్తుంది, పాత నాలెడ్జ్, ఆలోచనలు, అభిప్రాయాలు ఎంత అపరిపక్వమైనవో అర్థమవుతుంది.

Sunday, November 22, 2015

నీ సమస్యకు - నీవే పరిష్కారం




నీకు నచ్చిన వ్యక్తి/వ్యక్తులతో నీకు వచ్చిన ఒక సమస్యను పంచుకోవడం ద్వారా నీకు ఎంతోకొంత ఉపసమనం కలుగుతుంది. నీవు చెప్పినది విన్న వ్యక్తి దాని పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు  కూడా చేస్తాడు.అవి ఉపయోగించి నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవచ్చు. అది ఒక సులభమైన మార్గం,,,,, 

కాని ఒక్కసారి  ఆలోచించు....    

నీవు పరిష్కరించుకోలేని, నీకు పరిష్కారం, సమాధానం  దొరకని ప్రశ్నలను మాత్రమే  మనం సమస్య అంటాము. కాని ఈ మానవ జీవితంలో, ఈ విశాల విశ్వంలో పరిష్కరించుకోలేనిది ఏది లేదు. ప్రతి సంఘటనకు, ప్రశ్నకు, ఎవరో ఒకరు, ఎపుడోకపుడు, ఎలాగో ఒకలాగా సమాధానం, పరిష్కారం కనుగొన్నారు, కనుగొంటూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ 'సమస్య '    అనే సమస్యే లేదు. అన్నిటికి పరిష్కారం ఉంది...

నీవు సమస్య అనుకొనే ప్రశ్నకు పరిష్కారం వేరే వారు సూచించడం ఏమిటి? 
వారు  అనుభవించని ఒక సమస్యకు నీవు చెప్పిన దానిని విని, ఆకళింపు చేసుకొని వారు   ఒక పరిష్కారం చూపిన్చకలిగినపుదు, నీ ప్రశ్నకు సమాధానం చెప్పగలిగినపుడు..అ సంఘటనను అనుభవించి, వాస్తవంగా దాని పూర్వాపరాలు, లోతుపాతులు పూర్తిగా తెలిసిన, అవగాహనా కలిగిన, దానిని అనుభవిస్తూ ఉన్న,  నీవు   అ సమస్యకు పరిష్కారమార్గం కనుగోనలేవా? 

ఆలోచించు, ఆధారపడు... నీ సామర్ధ్యం మీద, నీ బలాబలాల మీద,  నీ ఆత్మ విశ్వాసం మీద , నీ ఆలోచన పద్దతుల మీద,  నీ దృక్పదం మీద,  నీ మనస్సాక్షి మీద,  నీ మానసిక పరిపక్వత మీద,  నీ ధైర్యం మీద, , నీ మీద నమ్మకం ఉంచు.........ఇప్పుడు ఆ సంఘటన/సమస్య/ప్రశ్న గురించి పూర్తిగా ఆలోచించు, అవకాసాలను పరిశీలించు, ఆలోచనలకూ పదునుపెట్టు, తప్పు, ఒప్పులను బేరీజు వేసుకో.....నీకు నువ్వే....సరైన, మంచి, సులభమైన పరిష్కారం కనుగోనగలవు, కనుగోంటావు.

ఎందుకంటే నీ సమస్య గురించి, నీ గురించి, సమస్య సృష్టించిన వ్యక్తి లేదా పరిస్థితుల గురించి నీ కన్నా తెలిసిన వారు ఎవ్వరు లేరు, వుండరు....వుండబోరు కూడా......

సమస్య నీది....పరిష్కారం కూడా నీదే/నువ్వే కావాలి...      అవతలి వ్యక్తుల మీద, వారి అనుభవాల మీద కచ్చితంగా ఆధారపడు... వారి సలహాలు, సూచనలు పాటించు కాదనను....కాని నువ్వు నిజంగా ఆలోచించగలిగితే ....వారిచ్చిన సలహాలు, సూచించిన పరిష్కారాలు నీకు ముందే తెలిసినవే...లేక నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నించలేకపోయినవే.....

లే...నిన్ను నువ్వు నమ్ముకో ....నీ సమస్యలకు నీవే పరిష్కారం కనుక్కో....అసలు నీకు తెలియని పరిష్కారం లేనే లేదు....

కాకపోతే అనుకోని సంఘటనల వల్ల, అనవసరపు ఆలోచనల వలన, పరిస్థితుల వలన, మనుషులు వారి మనస్తత్వాల వలన, నీలోను, నీ మనసులోనూ, నీ గుండె లోతుల్లోను కలిగిన అనవసరపు ఆందోళనల అలజడులనే అశాంతి నీకు మాత్రమే ఉండే అతీంద్ర, అతి సామాన్యమైన, అ సామాన్య శక్తులను చిన్నాభిన్నం చేసింది, విచ్చిన్నం చేసింది..........ఆ అలజడుల సవ్వడులకు బయపడి ఆగిపోకు, నీరసించి నిరాశ, నిష్ప్రుహలకు లోనయి..నీ శక్తిని తక్కువ చేసుకొంటూ....నిన్ను నువ్వు క్రుంగదీసుకోకు ....

లే...నీలో ఉన్న,నీకు మాత్రమే ఉండే అతీంద్ర, అతి సామాన్యమైన, అ సామాన్య శక్తులను  (ఒక్కటిగ చెయ్యి) ఏకీకృతం చెయ్యి, నీ మనసును కేంద్రీకృతం చెయ్యి .....నీకు మామూలు పరిస్థితులలో ఉండే విచక్షణ జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని, మొక్కవోని ధైర్యాన్ని,కష్టాలను కడతేర్చుకొనే యుక్తిని...ఇలాంటి విపత్కర పరిస్తితులలోను కూడ తీసుకో కలిగితే....చాలు...నీకు ఇనేకేమి అవసరం లేదు....ఏ/ఎవ్వరి సహాయం అక్కరలేదు........అవసరములేదు.....సమస్య చిన్నదైన, పెద్దదైన, పాతదైన, కొత్తదైన,నీకు సంభంధం ఉన్న లేకపోయినా, నీ ప్రమేయం ఉన్న లేకపోయినా...అది ఏదైనా..ఎలాగైనా....నీ తప్పు లేనప్పుడు ....నిర్భయంగా పరిష్కార మార్గాలను ఆచరించు.....మంచి, ప్రేమ, దయ, జాలి  అనే మాటల ముసుగులో ఎప్పుడు చెడును (చెడు సమస్యలను)  ప్రోత్సహించకు   , సహించకు, పెంచి పోషించకు...... ఏ సమస్య గురించి ఎక్కువ ఆలోచిస్తూ సమయం వృధా చేసుకోకు.....ఆనందాన్ని దూరం చేసుకోకు.......నిన్ను నువ్వు క్రుంగ దీసుకోకు....

నీకు నువ్వే ఎన్నో రకాలైన పరిష్కారాలు కనుగోనగలవు...      
ఎలాంటి సమస్యనైన పరిష్కరించుకోగాలవు......
ఎలాంటి సందర్భానైనా ఎదుర్కోగలవు... 
ఎవ్వరినైన ధైర్యంగా  ఎదిరించగలవు..

కావాల్సిందల్ల...సమస్యపై లోతైన పరిశీలన..........
చేయవలసిందల్లా.....తర్వాత నీ శక్తులన్నింటి ఏకీకరణ....
తర్వాత చెడు పై నీ పరిష్కారాల ఆచరణ.... 

నీ కంటే బలమైన ఏ శక్తి ఈ ప్రపంచంలో లేదు......నువ్వే అత్యంత బలమైన శక్తివి, యుక్తివి.....నీ సమస్యకు - నీవే పరిష్కారం  ఆలోచించగల వ్యక్తివి...

వికాసానికి 10 వివేకాలు


చదువు... కెరీర్... జీవితం... అన్ని రంగాల్లో దూసుకుపోవడానికి స్వామీ వివేకానంద సూచించిన 'కోటబుల్ కోట్స్' మీకోసం

1. ప్రేమ.. డబ్బు.. జ్ఞానం.. చదువు.. దేనికోసమైనా తపనపడుతూ పిచ్చివాడై పోయేవాడికి అది తప్పకుండా దొరుకుతుంది. అందుకోసం మనం కనబరచాల్సిందల్లా ఉడుంపట్టులాంటి పట్టుదల, సంకల్పబలం, శ్రమించేతత్వం.

2. గొప్ప అవకాశాలే వస్తే ఏమీ చేతకానివారు కూడా ఏదో గొప్ప సాధించవచ్చు. ఏ అవకాశాలూ లేనప్పుడు కూడా ఏదైనా సాధించినవాడే గొప్పవాడు.

3. ఆత్మవిశ్వాసం లేకపోవడం అనేది క్షమించరాని నేరం. మన చరిత్రలో ఏదైనా సాధించిన గొప్ప వ్యక్తుల జీవితాలను నిశితంగా పరిశీలించండి. వారిని నడిపించింది ఆత్మవిశ్వాసమేనని తెలుస్తుంది. భగవంతుడి పట్ల నమ్మకం లేనివాడు నాస్తికుడనేది ఒకప్పటి మాట. ఆత్మవిశ్వాసం లేనివాడు నాస్తికుడన్నది ఆధునిక మతం.

4. ఎవరికో బానిసలా కాకుండా నువ్వే యజమానిలా పనిచెయ్యి. నిర్విరామంగా పనిచెయ్యి. బాధ్యత తీసుకో. అది నిజంగా నిన్ను యజమానిని చేస్తుంది.

5. పనికీ విశ్రాంతికీ మధ్య సరైన సమతౌల్యం ఉండాలి.

6. పిరికితనానికి మించిన మహాపాపం ఇంకోటి లేదు. ఒక దెబ్బతింటే రెట్టింపు ఆవేశంతో పది దెబ్బలు కొట్టాలి. అప్పుడే మనిషివని అనిపించుకొంటావు. పోరాడుతూ చనిపోయినా పర్లేదు. కానీ పోరాటం అవసరం.

7. అనంత శక్తి, అపారమైన ఉత్సాహం, అమేయ సాహసం, అఖండ సహనం.. ఇవే మనకు కావాలి. వీటితోనే ఘనతను సొంతం చేసుకోగలం. వెనక్కి చూడకండి. ముందంజ వేయండి.

8. మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలిసి పొందికగా ఐదునిమిషాలు పని చేయలేం. ప్రతివ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్ధ చెడిపోతున్నాయి.

9. మనస్సు, శరీరం రెండూ దృఢంగా ఉండాలి. ఉక్కు నరాలూ ఇనుపకండలూ కావాలి మనకి. మేధస్సుకు చదువులాగా శరీరానికి వ్యాయామం అవసరం. నిజానికి ఓ గంటసేపు పూజ చేసే కన్నా పుట్ బాల్ ఆడటం మంచిది. బలమే జీవితం... బలహీనతే మరణమని గుర్తించండి.

10. వెళ్లండి. ఎక్కడెక్కడ క్షామం, ఉత్పాతాలు చెలరేగుతున్నాయో అలాంటి ప్రతి ప్రదేశానికీ వెళ్లండి. మీ సేవలతో బాధితులకు ఉపశమనాన్నివ్వండి. వ్యధను తుడిచే ప్రయత్నం చెయ్యండి. ఆ ప్రయత్నంలో మహా అయితే మనం చనిపోవచ్చు. కానీ ఆ మరణం కూడా మహోత్కృష్టమైనది. కూడగట్టాల్సింది సహాయం.. కలహం కాదు. కోరుకోవల్సింది సృజన.. విధ్వంసం కాదు. కావలిసింది శాంతి, సమన్వయం.. సంఘర్షణ కాదు.

About భయం - By Veerendranadh Sir

అన్నిటికీ భయపడేవాడు అసమర్థుడు.
దేనికీ భయపడనివాడు మూర్ఖుడు.
దేనికి భయపడాలో తెలుసుకున్నవాడు జ్ఞాని.
సహేతుక భయానికి జాగ్రత్త పడేవాడు మేధావి.
నిరర్ధక భయాల్ని ఎదుర్కోగలిగేవాడు విజేత.
‘భయం’ కనబడని దెయ్యం లాంటిది. భయపడే కొద్దీ మరింత భయపెడుతుంది. భయాన్ని ఎలా భయపెట్టాలో జైన గ్రంథంలో ఆరు సూత్రాల కథ ఒకటి ఉన్నది.
ఇతరుల కన్నా కాసింతయినా భిన్నంగా బ్రతకనివాడు జీవితంలో ఏ థ్రిల్లూ పొందలేడు.
"Drive the devil (fear) out" seminar by me. today (sunday) at 2.30 pm. at shirdi sai temple .... sivam road. Entry: free.
జైనులు చీమకు కూడా హాని తలపెట్టరు; అటువంటి జైన ధ్యాన ప్రార్ధనా మందిరంలో శిష్యుడి పక్కన కత్తి ఉండడం చూసి గురువు నివ్వెరపోయి కారణం అడిగాడు. "ఆచార్యా! ధ్యానం చేస్తూండగా నన్ను కబళించటానికి ఒక పెద్ద తేలు వస్తోంది. రోజు రోజుకూ దాని పరిణామం పెరుగుతోంది. భయంతో ధ్యానంపై మనసు నిలవటం లేదు. ఈ విషయం మీకు చెప్పాలంటే ఇబ్బందిగా అనిపించి, నేనే స్వయంగా దాన్ని సంహరిద్దామని కత్తి తెచ్చుకున్నాను" అన్నాడు శిష్యుడు.
"కత్తి బదులు ఒక సుద్దముక్క పెట్టుకో. రేపు అది కనపడగానే వీపు మీద గట్టిగా 'X’ గుర్తు పెట్టు. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు చెప్పు" అన్నాడు గురువు.
మరుసటి రోజు ధ్యానం చేస్తూ ఉండగా ఆ తేలు మళ్ళీ వచ్చింది. చేతిలోని సుద్దనే కత్తిగా భావిస్తూ, కసి తీరా దాని మీద లెక్క లేనన్ని సార్లు అడ్డంగా నిలువుగా గీశాడు. అక్కణ్ణుంచి అది వేగంగా పారిపోయింది. ధ్యానం పూర్తయిన తర్వాత గురువు మందిరంలోకి వెళ్ళి జరిగింది చెప్పాడు.
"నీ కడుపు మీది వస్త్రం పైకెత్తు" అన్నాడు గురువు. అక్కడ చూసిన శిష్యుడు నిశ్చేష్టుడయ్యాడు. అతడి కడుపుపై లెక్కలేనన్ని ‘ఇంటూ’ మార్కులు ఉన్నాయి. అప్పుడా జైన గురువు ‘భయము బాహ్యము కాదనీ అంతర్గతమనీ’ చెపుతూ, భయంతో పోరాడటానికి ఆరు సోపానాల మార్గాన్ని చెప్పాడు:
1. నీ భయము సహేతుకమా, నిర్హేతుకమా శోధించు. సహేతుకమయిన భయాన్ని 'జాగ్రత్త' అంటారు. అది అభిలాషణీయము. 2. నీ భయాలన్నిటికీ నీవే కారణమన్న వాస్తవాన్ని నమ్ము. 3. నీ భయం వల్ల నీకు కలిగే నష్టాల్ని గుర్తించు. 4. భయాన్ని పారద్రోలే మార్గాన్ని అన్వేషించు. 5. పోరాడు. 6. నీ భయానికీ, దానివల్ల వచ్చే నీ నష్టానికీ నీవే బాధ్యుడవని అర్థం చేసుకో..!